March 26, 2010 న తెలుగురత్నలో ప్రచురితం.
http://teluguratna.com/blog/2010/03/26/%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%af%e0%b1%81%e0%b0%97%e0%b0%82/
బ్రహ్మ తన సృష్టి కార్యాన్ని మందగించిన వేళ…
శివుడు ప్రళయ కాలభధ్రుడై విలయ తాండవం చేస్తున్న వేళ…
భూప్రపంచం మొత్తం దద్దరిల్లి పోతోంది… దిక్కులన్నీ పెక్కటిల్లేలా ఆర్తనాదాలతో నిండిపోతోంది!!!
ఒక వైపు మేఘాలు ఆగ్రహంతో అగ్ని కీలలనను ఉరుముతుంటే…. మరో వైపు అవే మేఘాలు జరిగిన దానికి వెకిలి కన్నీళ్ళు కారుస్తునట్లు హోరుగా వర్షిస్తునాయి…..
ఒక దిక్కున అకారణ భూకంపాలతో భారి కట్టడాలు సైతం కుప్పకూలిపోతుంటే…. మరో దిక్కున ఉవ్వెత్తున పోటెత్తే అలలు ‘ఇది కూడ ఒక ఎత్తేనా’ అని అడ్డుపడే ఎత్తులను పరిహసిస్తూ అవలీలగా తమలో కలిపేసుకుంటున్నాయి.
అగ్ని పర్వతాలు బ్రద్దలౌతున్నాయి.ఉవ్వెత్తున ఎగిసి పడే అగ్ని జ్వాలలు ఇన్నాళ్ళూ తన మేధస్సుతో అంచెలుగా ఎదిగి, ప్రకృతిని శాసించగలిగి ‘ప్రపంచాన్ని సైతం జయించగలనూ’ అని ప్రకటించుంకున్న మూర్ఖ మానవుని ప్రయోగాల కోటల్ని ఛిద్రం చేస్తూ క్షణంలో భూస్థాపితం చేస్తునాయి.
మనిషి మనుగడ నేర్చింది ప్రకృతి నుంచే,దాన్ని విస్మరిస్తే ప్రకృతిలోనే కలసిపొవాలసిందె అని గుర్తుచెస్తూ ప్రతి ఒక్కరూ శిక్షింపబడుతునట్లు ప్రాణ భయంతో పరుగులెత్తిస్తునాయి.
ప్రాంతాలకతీతంగా సకల ప్రాణులూ భగవంతుని ప్రార్థించే వేళ….
తమను రక్షించే ఏదో శక్తి కోసం ఆశగా ఎదురుచూస్తున్న వేళ…..
* * *
ఉన్నట్టుండి ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది.ఆ వెలుగు రెప్పపాటులో అంతకంత రెట్టింపవుతూ కళ్ళు మిరుమిట్లుగొలిపే కాంతి ఆవరించుకుంది.ఇప్పటి వరకు కటిక చీకటిని చూసి వుండచ్చుగాక, కటిక వెలుగులా(??…) ఇంత కాంతి ఉన్నా గుర్తించలేని విధంగా ప్రకాశించింది.సాటి ప్రాణి మీద ప్రేమ,దయలేని…అసలు పక్క వాడి ఎదుగుదలే చూడలేని అల్ప మానవుడి కళ్ళు ఇంతటి వెలుగును దర్శించడానికి అనర్హమంటూ వారి కళ్ళు శాశ్వతంగా మూతపడ్డాయి.భూమి దారి తప్పి సూర్యుని కక్ష వైపు వెళ్తోందా లేక ఏదైనా వచ్చి ఢీకొనబోతోందా అని అశేష ప్రజానీకం(?) భయపడుతూండగా…..
ఆకాశంలో మెల్లగా ప్రత్యక్షమౌతోంది… ఓ రూపం!!!!
అప్పటి వరకు కళ్ళు తెరిచి చూడలేనంతగా ఆవరించిన కాంతి క్రమంగా సాధారణ స్థాయికి వస్తోంది.వెలుగుని చూడలేక కళ్ళు పోగా మిగిలిన ప్రాణికోటి మొత్తం నెమ్మదిగా కనులు తెరిచి అటు వైపే చూడసాగాయి.
మొదటగా…. కనులు….. ఆ తర్వాత…..పెదవులు!!!
అద్భుతం…మహాద్భుతం!!నమ్మశఖ్యం కాని నిజం!!!
మొదటగా…. కనులు….. ఆ తర్వాత…..పెదవులు!!!
అద్భుతం…మహాద్భుతం!!నమ్మశఖ్యం కాని నిజం!!!
జీవ జాతి మనుగడ కాపాడడం కోసం కలియుగాంతమున ‘కల్కీ గా అవతరించ శ్రీ మన్మహా విష్నువా!!!
పాపములను హరించి కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి దేవుడు పంపగా వచ్చిన ఏసు ప్రభువ… లేక అల్లాన… అనుకుంటూ తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించారు.కనిపిస్తునవి కళ్ళు పెదవులే అయినా ఏమని వర్నించగలం ఆ రుపాన్ని!!!
పాపములను హరించి కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి దేవుడు పంపగా వచ్చిన ఏసు ప్రభువ… లేక అల్లాన… అనుకుంటూ తమ ఇష్ట దైవాన్ని ప్రార్థించారు.కనిపిస్తునవి కళ్ళు పెదవులే అయినా ఏమని వర్నించగలం ఆ రుపాన్ని!!!
హిరణ్యకశ్యపుని చీల్చి చెండాడిన ఉగ్ర నరసింహుని వలే పాపులను శిక్షించడానికి వచ్చిన భగవంతుని లాగా లేవవి.అమృతాన్ని అసురులకు దక్కనివ్వకుండా చాకచక్యంతో దేవతలకు మాత్రమే పంచిన మోహినీమూర్తి కళ్ళు వలే మనోహరంగా ఉన్నాయి.ఎన్ని కష్టాలు అనుభవించినా,ఒక్క బాణంతో లంకను శాసించినా చెరగని చిరునవ్వుగల శ్రీరామచంద్రుని వలే నిర్మలంగా ఉన్నాయా పెదవులు.
ఆహా…ఎన్నో జన్మల పుణ్య ఫలం.ఎవరికీ దక్కని అరుదైన అవకాశం.ఈ జన్మకి ఇంతకన్నా ఇంకేం కావాలి.ఇంక ప్రాణాలు పోయినా పర్వాలేదు!!!
అలా క్షణ కాలం పాటు ముగ్దుల్ని చేసి ఆనందానుభూతులను కలిగించిన ఆ సుమనోహర రూపం క్రమంగా అదృశ్యమై ఓ చిన్న వలయాకారాన్ని సంతరించుకుంది.నూరు తప్పుల అనంతరం శిశుపాలుని పై సంధించిన శ్రీకృష్ణుని సుదర్శన చక్రం వలే వేగంగా తిరుగుతూ భూమి వైపు దూసుకొచ్చింది.ఊహించని విధంగా పెద్దదవుతూ నిర్దేశింపబడినట్లుగ కొంతమంది మానవులను, జంతువులను, వృక్ష సంపదను తనలో ఐక్యం చేసుకుంటోంది.
కొంతమంది ప్రజానీకం దాన్ని చూసి ఏదో మాయని భయపడి పారిపోతూంటే,కొంతమంది అన్ని ఆశలూ వదిలేసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. అక్కడక్కడా మిగిలిన కొంతమంది భారతీయులకు మాత్రం ఓ విషయం స్పష్టంగా అవగతమౌతోంది…
సత్య యుగంలో జలప్రళయం సంభవించినపుదు మత్స్యావతారంలో వచ్చి మరో యుగమునకు అవసరమైన భూసంపదను ఒక ఓడలో చేర్చి,ప్రళయం తగ్గు వరకు ఆ ఓడను హిమవంత పర్వతం దగ్గర భద్రపరచినట్లు..!
పాల సముద్రాన్ని చిలికేటప్పుడు కూర్మావతారంలో వచ్చి మందర పర్వతాన్ని ఒరిగిపోకుండా కాపాడి అడుగంటిపోతున్న దేవతల ఆశల్ని నిలబెట్టినట్లు…!!
వేదాలను పవిత్ర గ్రంధాలను దొంగిలించి,భూప్రపంచాన్ని సముద్రగర్భంలోని పాతాళానికి తోసేస్తున్న హిరణ్యాక్షుడిని వరాహావతారంలో అంతమొందించి గ్రంధాలను,ప్రపంచాన్ని కాపాడినట్లు…అవును!అదే!!!
పాల సముద్రాన్ని చిలికేటప్పుడు కూర్మావతారంలో వచ్చి మందర పర్వతాన్ని ఒరిగిపోకుండా కాపాడి అడుగంటిపోతున్న దేవతల ఆశల్ని నిలబెట్టినట్లు…!!
వేదాలను పవిత్ర గ్రంధాలను దొంగిలించి,భూప్రపంచాన్ని సముద్రగర్భంలోని పాతాళానికి తోసేస్తున్న హిరణ్యాక్షుడిని వరాహావతారంలో అంతమొందించి గ్రంధాలను,ప్రపంచాన్ని కాపాడినట్లు…అవును!అదే!!!
కల్కీగా మళ్ళీ అవతరించి తమను కాపాడడానికే ఆ మాయా వలయాన్ని సృష్టించాడు.బుడతడిగా వచ్చి సర్వలోకములను ఆక్రమించిన వామనుని పాదం వలే ఇంతై…ఇంతింతై అన్నట్లు ఆ వలయం రెట్టింపవుతోంది.పిల్లలు,పుణ్యాత్ములైన ముదుసలివాళ్ళు సైతం అందులోకి లీలగా వెళ్ళిపోతూండగా,అందులోకి ప్రవేశించుటకు ప్రయత్నించిన పాపులకది క్షత్రియులను చెండాడిన పరశురాముని గండ్రగొడ్డలిలాగా హెచ్చరిస్తోంది.తెగించి ముందుకి వెళ్ళిన వారు వెళ్ళినట్లుగానే చనిపోతున్నారు.
* * *దుష్టులు శిక్షించబడ్డారు.మిగిలిన వారు వలయంలోకి వెళ్ళిపొయారు.వలయం సుడిగాలి వలే తిరుగుతూ వారిని సురక్షిత
ప్రదేశంలో వదిలేసింది. కార్యం పూర్తైయింది. యుగం ముగిసింది.
రాబోతున్నది అనందానుభూతులు పంచే స్వచ్ఛమైన సమాజం.
అవతరించబోతున్నది మరో యుగం…..మహాయుగం!!!!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి